ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-24 11:57:25  IST  )

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది...

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు మరో భారీ పెట్టుబడి(Huge investment) రాబోతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Government) ఆహ్వానం, ప్రధాని మోడీ(Pm Modi) చొరవతో పలు కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయి. ఆయా కంపెనీలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. దీంతో మరిన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు సుముఖుత చూపుతున్నాయి. ఇందులో సౌదీ అరేబియా(Saudi Arabia) కూడా భాగస్వామి కాబోతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మే2న ప్రధాని మోడీ(Pm Modi) పర్యటనలో ఏపీ, సౌదీ అరేబియా మధ్య డీల్ కుదరనుంది. మోడీ సమక్షంలో భారత్, సౌదీ అరేబియా మధ్య ఎంఓయూ చేసుకోనున్నారు.

కాగా ఏపీలో సౌదీ అరేబియా బీపీసీఎల్ రిఫైనరీ(BPCL Refinery) పెట్టనుంది. ఈ రిఫైనరీలో ఆరామ్ కో(Aram Co) 26 శాతం వాటా తీసుకోనుంది. ఆరామ్ కో సౌదీ ప్రభుత్వం చమురు సంస్థ. ఏపీతో పాటు గుజరాత్ రిఫైనరీలోనూ సౌదీ పెట్టుబడి పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో ఆరామ్ కో రూ. 18 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కంపెనీలకు కొత్త ఉత్సాహం లభించనుంది.

Next Story