టీటీడీకి మరో భారీ విరాళం

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారికి విరాళాలు ప్రతినిత్యం భారీగా పెరుగుతున్నాయి..

టీటీడీకి మరో భారీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారికి విరాళాలు(Donations) ప్రతినిత్యం భారీగా పెరుగుతున్నాయి. స్వామివారి భక్తుల(Devotees)కు సేవలు చేసేందుకు తమవంతుగా పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు, సినీ స్టార్లు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఎవరో ఒకరు విరాళాలకు సంబంధించిన చెక్కులను టీటీడీ అధికారులకు అందజేస్తున్నారు. తాజాగా బెంగుళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.వి.ఎల్. నరసింహ రాజు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.

Next Story