Honey Trap: ఏపీలో మరో హనీ ట్రాప్ కలకలం

by Vemula.Srinu Prasad |

ఏపీలో మరో హనీ ట్రాప్ కలకలం రేగింది...

Honey Trap: ఏపీలో మరో హనీ ట్రాప్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో హనీ ట్రాప్(Honey Trap) కలకలం రేగింది. విశాఖ జిల్లా భీమిలి(Bheemili)లో ఓ యువతి(Young Girl) చేసిన ట్రాప్‌లో శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి పడ్డారు. ఈ నెల 18న రామారావుకు యువతి ఫోన్ చేశారు. పెద్దిపాలెంకు రావాలని చెప్పారు. దీంతో ఆయన 19న బయల్దేరారు. అయితే అక్కడి వద్దని సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని రామారావుకు మళ్లీ ఫోన్ చేశారు. దీంతో అక్కడకు వెళ్లగానే ఆయనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామారావును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆయన వద్ద ఉన్న రూ.48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కుని పారిపోయారు. అయితే రామారావు ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఈ రోజు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 7 వేలు తీశారు. దీంతో బాధితుడు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story