- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ ఛీ.. ఇదేం పాడుపని.. వైరల్ అవుతున్న మరో నేత రాసలీల వీడియో
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వివాదం సర్దుమణగకుండానే మరో నేత రాసలీలల వీడియో బయటికొచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఉన్న నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ విషయంలో ఆచితూచి అడుగేయాలి. కానీ.. ఏపీ రాజకీయాల్లో ఇటీవల కాలంలో కొందరి రాసలీలలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఫర్ ఎగ్జాంపుల్.. జనసేన విప్ అరవ శ్రీధర్ ఇష్యూనే చూద్దాం. దీనిపై వైసీపీ నానా రాద్ధాంతం చేసింది. జనసేన ఇంకా అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇటు బాధితురాలు, అటు అరవ శ్రీధర్ తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టగా.. పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ వివాదం పూర్తిగా సర్దుమణగక ముందే.. కూటమిలో మరో నేత రాసలీలలు బయటపడ్డాయి. ఏకంగా మైనర్ నే ట్రాప్ చేసి.. నగ్న వీడియోలు తీశాడంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉన్న కూటమి నేతలకు అసలిదేం బుద్ధి అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్కూలుకువెళ్లే బాలికను నాగేంద్ర అనే వ్యక్తి అడ్డుకుని లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె వద్దని వారించినా వినకుండా బలవంతం చేయడం, ఆ పక్కనే ఉన్నవారెవరో లైట్ ఆర్పేయడం అన్నీ వీడియోలో రికార్డయ్యాయి. అశ్లీల వీడియోలు చిత్రీకరించడమే నేరం. అలాంటిది అతని వికృత చేష్టలకు నిదర్శనమైన వీడియోలు బయటికెలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాగేంద్ర బాలికలతో వీడియోకాల్స్ మాట్లాడి.. వారి ప్రైవేట్ పార్ట్స్ చూపించాలని ఒత్తిడి చేసేవాడని కూడా తెలుస్తోంది. మైనర్ బాలికలను ట్రాప్ చేసి రాక్షసానందం పొందుతున్న ఇలాంటివారిని కఠినంగా శిక్షించేలా ఏపీ పోలీస్ విభాగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. బాలికను వేధించిన వ్యక్తి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫాలోవర్ అని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిదేనా? అతను ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నాడా ? అన్న విషయాలపై స్పష్టత రావలసి ఉంది. ఏదేమైనా కూటమి నేతల కీచక బుద్ధి ఇదీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






