Covid: ఏపీలో మరో కొవిడ్​ కేసు!

by Thanuru Gopichand |

కొవిడ్​ కేసులు ఏపీని కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్​నిర్ధారణ అయింది.

Covid: ఏపీలో మరో కొవిడ్​ కేసు!
X

నంద్యాల జిల్లాకు చెందిన మహిళకు పాజిటివ్​

దిశ, డైనమిక్ ​బ్యూరో : కొవిడ్​ కేసులు ఏపీని కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్​నిర్ధారణ అయింది. ఆమెని రిమ్స్​లోని (Rims) ఐసోలేటెడ్​వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్​లో కొవిడ్​ బా ధితుల కోసం మొత్తం 20 బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కొవిడ్​సోకిన మహిళ స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి. ఆమె వయసు 70 ఏళ్లు. నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండగా వైద్యులు పరీక్ష నిర్వహించిన కొవిడ్​గా గుర్తించారు. నిన్న విశాఖలో ఓ మహిళలు కరోనా పాజిటివ్​గా నిర్ధారించిన విషయం తెలిసిందే. కొవిడ్​కేసులు వ్యాప్తి చెందుతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు గుం పులుగా గుమిగూడ కూడదని, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని పబ్లిక్ స్థలాల్లో కోవిద్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని.. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఎవరకైనా కరోనా (Corona) లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లో ఉండాలని.. వైద్యుల సలహాతో మందులు వాడాలని తెలియజేసింది.

Next Story