- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో సంస్థ లే ఆఫ్.. ఆందోళనలో 250 మంది కార్మికులు
ఏపీలో మరో సంస్థ లే ఆఫ్ ప్రకటించింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో సంస్థ లే ఆఫ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. నష్టాల కారణంగా జింథాల్ పరిశ్రమ(Jinthal Industry) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా కొత్తవలస(Kothavalasa)లో జింథాల్ పరిశ్రమ కొన్ని నెలలుగా నష్టాల్లో కొనసాగుతోంది. ఈ మేరకు లే ఆఫ్ ప్రకటించింది. దీంతో 250 మంది కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ ఎదుట బైఠాయించి యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పరిశ్రమను కొనసాగించాలని, తమకు ఉపాధి కాల్పించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పరిశ్రమలో పని చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఆందోళనకు స్థానిక సీఐటీయూ నాయకులు(CITU Leaders) మద్దతు పలికారు. జింథాల్ పరిశ్రమ హెచ్ ఆర్, డీజీఎమ్ గోపాలకృష్ణ(Jinthal Industries HR, DGM Gopalakrishna)తో చర్చించారు. పరిశ్రమను కొనసాగించాలని, కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. మరోవైపు శనివారం, ఆదివారం ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు.
పరిశ్రమ డీజీఎమ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కార్మికులు ప్రస్తుతం విధుల్లోకి హాజరుకావాలి. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం.’’ అని చెప్పారు.






