Kakani Govardhan Reddy : మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు.. రిమాండ్

by Muthe.Rajitha |

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)పై మరో కేసు నమోదైంది.

Kakani Govardhan Reddy : మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు.. రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)పై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన ఘటనలో కాకాణిపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో(Mutthukuru PS) కేసు నమోదు అయింది. పీటీ వారెంట్ పై పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. కాగా ఇప్పటికే కాకాణిపై 3 కేసులు నమోదై, రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉండగా.. ఇది నాలుగవ కేసు కాగా.. జులై 3 వరకు జైలులోనే ఉండనున్నారని పోలీసులు తెలిపారు.

Next Story