ఏపీలో మరో బస్సు ప్రమాదం

by Muthe.Rajitha |

ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా భక్తిరాజేరు (మం) మరడం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఏపీలో మరో బస్సు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా భక్తిరాజేరు (మం) మరడం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు బొబ్బిలి వైపు నుంచి విశాఖ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికుల సమాచారం. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story