- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి కాకాణికి మరో ఝలక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ (Illegal Mining of Quartz) వ్యవహారంలో కేసు నమోదై.. ఇప్పటికే తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ (Illegal Mining of Quartz) వ్యవహారంలో కేసు నమోదై.. ఇప్పటికే తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదు చేశారు. ఈ మేరకు ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కాకాణి ఇవాళ సాయంత్రం నెల్లూరు (Nellore)కు చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, రుస్తుం మైన్స్ (Rustom Mines)లో పేలుడు విచ్చలవిడిగా పేలుడు పదార్థాల వినియోగంతో అక్కడున్న గిరిజనులు కాకాణి అనుచరులను నిలదీశారు. వెంటనే మైనింగ్ ఆపేయాలని అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలోనే కాకాణి అనుచరులు నోటికొచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ.. గిరిజనులను బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదైంది.
మరోవైపు నెల్లూరు జిల్లా (Nellore District)లో మైనింగ్ తవ్వకాల(Mining Excavations) వ్యవహారంలో జరిగిన అవకతవకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో కాకాణిని A4గా చేర్చారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెండు సార్లు పోలీసులు ఇంటికి వెళ్లగా.. అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఆ నోటీసులలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే, ఆయన ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.






