ఏపీ ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్..ఆస్తి ప‌న్నుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్..ఆస్తి ప‌న్నుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిలపై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ అవకాశాన్ని ఈ నెల 30 వరకు కల్పించింది ఏపీ సర్కార్. అంటే ఆస్తి బకాయిలను చెల్లిస్తే ఐదు శాతం డిస్కౌంట్ వస్తుందన్నమాట. అదే సమయంలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీ పై 50% మాఫీ కూడా చేయనున్నారు.

2026 -27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించే వారందరికీ ఈ నెల 30వ తేదీ లోపు అవకాశం కల్పిస్తూనే, ఐదు శాతం ఆఫర్ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50% ఇప్పటికే రాయితీ ప్రకటించగా.. ఈ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా వెల్ల‌డించారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే వడ్డీతో పన్ను చెల్లిస్తే మాత్రం తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏపీ సర్కార్ ప్రకటనలతో చాలా మంది ఆస్తి పన్ను చెల్లించి రాయితీని పొందుతున్నారు.

Next Story