- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం: విద్యుత్ షాక్‌తో అన్నమృతి.. చివరిచూపుకోసం వస్తూ తమ్ముడు దుర్మరణం
by Seetharam |
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం గంజికుంట పొలంలో విద్యుత్ షాక్‌కు గురై నరేంద్ర కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ హైదరాబాద్‌లో ఉన్న తమ్ముడికి సమాచారం అందించారు. అన్న మృతి విషయం తెలుసుకున్న తమ్ముడు హైదరాబాద్ నుంచి గంజికుంటకు పయనమయ్యాడు. హైదరాబాద్ నుండి బయలుదేరిన తమ్ముడు రాజేష్ శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నదమ్ముల మరణ వార్తతో గంజికుంట గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
Next Story






