- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నమయ్య జిల్లా | అల్లుడిపై కిరాయి వ్యక్తులతో హత్యాయత్నం
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. బంధాలు బంధుత్వాల స్థానంలో పగలు, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అన్యోన్యంగా, ఆనందంగా ఉండాల్సిన వారు అహంకారం, అనుమానాలతో ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. బంధాలు బంధుత్వాల స్థానంలో పగలు, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అన్యోన్యంగా, ఆనందంగా ఉండాల్సిన వారు అహంకారం, అనుమానాలతో ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న వైషమ్యాలు హత్యల వరకు దారి తీస్తున్నారు. అటువంటి ఘటనే ఒకటి అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డనిచ్చి పెళ్లి చేసిన అత్త అల్లుడిపై కోపం పెంచుకుంది. తన బిడ్డతో తరచూ గొడవపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని భావించి అతన్ని మట్టుబెట్టాలని యత్నించింది. అయితే ఆ ప్రయత్నం విఫలమైనట్లుగా తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం రాపూర్ కు చెందిన మునుస్వామి నెల్లూరుకు చెందిన పెంచలమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. గత నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో పెనగలూరులోని మేనత్త ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అత్త పెంచలమ్మ అల్లుడు మునుస్వామిపై కోపం పెంచుకుంది. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలనే ప్రణాళికలు రూపొందించినట్లు తెలియవస్తోంది. అందుకు ఓ నలుగురు కిరాయి గూండాలను పురమాయించింది. వారు పెనగలూరులోని మునుస్వామి ఉంటున్న ప్రాంతానికి రెండు బైకులపై చేరుకున్నారు. మునుస్వామి వద్దకు వచ్చి పదునైన వస్తువులతో దాడికి దిగారు. గొంతుపై తీవ్రంగా దాడి చేయడంతో బెంబేలెత్తిపోయిన మునుస్వామి పెద్దగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్ని స్థానికులు పరుగులెత్తుతూ అక్కడకు రావడంతో వారిని చూసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే పదునైన వస్తువుతో సహా మునుస్వామిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటనపై పెనగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు సిటీలో దారుణం..
నడి రోడ్డుపై హత్యాయత్నం ఘటన నెల్లూరు సిటీలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం సిటీలో ఆర్టీసీ సిటీ బస్సును వెళ్తోంది. సైడ్ ఇవ్వాలని ఓ బైకర్, అతని స్నేహిడుడు హారన్ మోగించారు. ఈ క్రమంలో వారిద్దరు సిటీ బస్సు ఎక్కి డ్రైవరుతో పాటు కండక్టర్ పై పదునైన వస్తువులతో దాడికి దిగారు. ఈ దాడిలో డ్రైవర్ ముఖంపై తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నెల్లూరు సిటీ పోలీసులు తెలిపారు.






