- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నమయ్య జిల్లా | రక్తబంధాన్ని మంటగలిపిన మద్యం మత్తు
మద్యం (Alcohol) మత్తులో రక్త సంబంధం మంటగలిసింది. తోడబుట్టిన వాడే తన సోదరుడి పాలిట యముడయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్ : మద్యం (Alcohol) మత్తులో రక్త సంబంధం మంటగలిసింది. తోడబుట్టిన వాడే తన సోదరుడి పాలిట యముడయ్యాడు. మృత్యు రూపం దాల్చి సొంత అన్ననే కడతేర్చాడు (Younger Brothe Killed His Brother) ఓ తమ్ముడు.. నానాటికీ దిగజారిపోతున్న రక్త సంబంధాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం కండ్రగలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి సోదరులు శనివారం మద్యం సేవించారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఏదో విషయమై వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో సోదరులిద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. గొడవ ముదరడంతో తమ్ముడు రఫీక్ పదునైన వస్తువుతో తన అన్నపై దాడికి దిగారు. అన్నపై తమ్ముడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అన్నను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో అతను మరణించాడు. ఈ విషాదకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కారణంగా పచ్చని కుటుంబంలో విషాదం నెలకొనడం పట్ల ఇరుగు పొరుగు వారు సానుభూతిని తెలియజేస్తున్నారు.






