అన్నదాత సుఖీభవ... ఈ 6 జిల్లాల్లోని రైతులకు షాక్..!

by velandi.Saikiran |

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ డబ్బుల విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం ఆరు

అన్నదాత సుఖీభవ... ఈ 6 జిల్లాల్లోని రైతులకు షాక్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ డబ్బుల విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం ఆరు జిల్లాల్లలోని కొన్ని ప్రాంతాల రైతులకు... ఈ డబ్బులు పడబోవని అధికారులు స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో... అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఇందులో భాగంగానే... పీఎం కిసాన్ డబ్బులతో పాటు మొత్తం 7000 రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఆరు జిల్లాల్లో మాత్రం... ఈ పథకం అమలు కాబోదు. ఈ జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమ చేయకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నెల 10 అలాగే 12వ తేదీలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోడ్ అయ్యేవరకు.. ఎలాంటి పథకాలు అమలు చేయకూడదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో... ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తారు.

Next Story