- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంతో అనుసంధానంగా అమలు చేయబడుతుంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తో పాటు వ్యవసాయ కార్యకలాపాలకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేస్తున్నారు ఇందులో.. రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.2342.92 కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.7వేలు జమ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పలు ప్రాంతాల్లో లోకల్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆరు మండలాల రైతులకు.. ఎన్నికల అనంతరం ఈ డబ్బులు జమ కానున్నాయి.






