- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో బర్డ్ ఫ్లూ... పశుసంవర్థక శాఖ కీలక ప్రటకన
ఏపీలో బర్డ్ ఫ్లూ తో పశుసంవర్థక శాఖ అప్రమత్తమైంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బర్డ్ ఫ్లూ(Bird flu) విజృంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలుచోట్ల వందలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి(East Godavari), పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)ల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగిన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పలు కోళ్ల ఫారాల్లో సోదాలు నిర్వహించారు. కోళ్లను పరిశీలించారు. శ్యాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు. వేర్పూలు , కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. ఈ రెండు ప్రాంతాల పరిధిలో నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయి. వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ పై ప్రజలు అందోళన చెందొద్దన్నారు. అప్రమత్తం చేసిన ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల చికెన్, గుడ్లు తినొచ్చని స్పష్టం చేశారు.






