ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు

by Malleboina Mahesh |

దీపావళి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్తను అందించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్తను అందించింది. దీపావళి కానుకగా 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ (Dearness Allowance) 3.64% పెంపును అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఇక గత నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇప్పించడం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు డీఏ జారీ అవుతుంది.

ప్రతి నెలా దీనికి రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) తెలిపారు. అదనంగా, మహిళా ఉద్యోగులు ఇప్పుడు రిటైర్మెంట్‌కి ముందు ఎప్పుడైనా తీసుకునే 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ పొందగలరు. కేరళలో 68%, తెలంగాణలో 38%, తమిళనాడులో 42%, కర్ణాటకలో 38% ఆదాయం జీతాలకు వెళుతున్న సంగతి వెల్లడిస్తూ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Next Story