- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రా యూనివర్సిటీలో హాస్టల్ మెస్ కు తాళం
సమస్యలకు పరిష్కారం కోరుతున్న విద్యార్థులు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీలో (Andhra University) విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించాలని యూనివర్సిటీ అధికారులను కోరుతున్నప్పటికీ పరిష్కరించడం లేదని విద్యార్థులు (Students) ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి క్యాంపస్ లోని మెస్ లకు తాళం (Locked Mess) వేసి ఉందని చెబుతున్నారు. దీంతో ఆహారం (Food) కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందంటున్నారు. ఈరోజైనా మెస్ తాళాలు తెరుస్తారని ఆశించగా తమకు నిరాశే మిగిలిందని అంటున్నారు. ఎందుకు మెస్ తాళం తీయడం లేదని ప్రశ్నిస్తే ఫీజులు కడితేనే తెరుస్తామని నిర్వాహకులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామని విద్యార్థులు అంటున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నామని.. తమ కడుపు ఎండబెడితే ఎలా చదువుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెస్ లకు తాళం వేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందిస్తూ.. నిర్వాహకులు ఫీజు కడితేనే ఫీజు కడితేనే మెస్ తెరుస్తామని చెప్పడం అత్యంత క్రూరమైన చర్య అని ఆరోపించారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో నేడు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల లేమితో పాటు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వారు విమర్శించారు. హాస్టల్ మెస్ సమస్యను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యాబుద్ధులు నేర్పే ఆలయంలో ఇలాంటి "ఆకలి మంటలు" రేగడం వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్యార్థుల ఆరోపణలను పరిశీలించి. వాస్తవాలను నిగ్గుతేల్చి సమస్యను పరిష్కరించాలని పలువురు అధికారులను కోరుతున్నారు.






