ఆంధ్రప్రదేశ్ కు చేయూతనివ్వాలి : సీఎం చంద్రబాబు నాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-19 11:05:57  IST  )

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ కు చేయూతనివ్వాలి : సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి భేటీ అవ్వగా ఆయన వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని, నిధులు విడుదల చేయాలని అన్నారు.

జలశక్తి మంత్రితో భేటీ అనంతరం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్వోదయ, సాస్కీ పథకాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్ద ప్రస్తావించారు. ఆ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతనివ్వాలని కోరారు. అమరావతిలో జాతీయ బ్యాంకుల ప్రారంభోత్సవంలో ప్రస్తావించిన విధంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. అందుకోసం వచ్చే బడ్జెట్ లో నధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అదే విధంగా పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని విన్నవించారు. సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదతరులున్నారు.

READ MORE ....

ఆ కార్యక్రమం ఫెయిల్: జగన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Next Story