- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి భారీ గుడ్ న్యూస్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌కు శుక్రవారం భారీ గుడ్ న్యూస్ లభించింది...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు శుక్రవారం భారీ గుడ్ న్యూస్ లభించింది. ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. విశాఖ రైల్వే జోన్(Visakha Railway Zone) ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మేరకు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్(South Coast Railway Zone) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్(Central Cabinet) భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. ఇప్పటికే వాల్తేరు డివిజన్(Walther Division) పేరును కూడా విశాఖ డివిజన్(Visakha Division)గా మార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ కూడా కేంద్రం ఇచ్చింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన మామీ మేరకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోంది. విభజనతో ఆర్థికంగా వెనుకబడిన ఏపీకి చేయూతనిస్తోంది. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేసింది. పలు ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. తాజాగా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అటు రాష్ట్ర ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఇక విశాఖ ప్రజల ఆనందానికి హద్దుల్లేవ్.. విశాఖ రైల్వే జోన్ ఏన్నో ఏళ్ల కల అని అంటున్నారు. కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.






