ఆయనో నిఘంటువు: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-28 09:21:35  IST  )

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు..

ఆయనో నిఘంటువు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు. వెండితెరపైనే కాకుండా, రాజకీయ యవనికపైనా ఎన్టీఆర్ ముద్ర చెరిగిపోనిదని కొనియాడారు.

ఎల్లప్పుడూ ప్రజాపక్షమే...

రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే వహించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, భావితరాలకు ఆయనో నిఘంటువు అని ప్రశంసించారు.

ఎన్టీఆర్ స్థానం శాశ్వతం..

అంతకుముందు వెండితెరపై కథానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి కోట్ల మంది ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారని అన్నారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ స్థానం శాశ్వతమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story