- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యూరిక్ లో బిజీబిజీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
దావోస్ వేదికపై కలిసిన కూటమి పార్టీల నేతలు.

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూరిచ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఘనస్వాగతం పలికారు. 'సంభాషణ స్ఫూర్తి' (A Spirit of Dialogue) అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విజన్‌ను ప్రపంచ దేశాలకు వివరించడమే లక్ష్యంగా చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు.
జ్యూరిక్ పర్యటనలో భాగంగా పలువురు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కీలక భేటీలు నిర్వహించారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో సహకారంపై చర్చించారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగాను కలిసి రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు కోరారు. దావోస్ సదస్సుకు హాజరవుతున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కూడా ఆయన జ్యూరిక్ లో కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గూగుల్ క్లౌడ్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశమై ఏఐ (AI), సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. దావోస్ వెళ్లే ముందు జ్యూరిక్ లో సుమారు 20 దేశాల నుంచి వచ్చిన ప్రవాస ఆంధ్రులతో (NRTs) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read More..






