- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది...

X
దిశ, ఏపీ బ్యూరో అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు, శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
Next Story






