- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఆంధ్రా పేపర్ మిల్ ఆకస్మిక లాకౌట్
తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఆంధ్రా పేపర్ మిల్లును యాజమాన్యం అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కడియం(Kadiyam)లో ఆంధ్రా పేపర్ మిల్లు(Andhra Paper Mill)ను యాజమాన్యం అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిర్ణయంతో సుమారు 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడి, తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా గేట్లు మూసివేయడంతో కార్మికులు అయోమయంలో పడిపోయారు.
ఐదు రోజులుగా కార్మికుల నిరసన
గత ఐదు రోజులుగా తమ బకాయి వేతనాల కోసం కార్మికులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని, స్కిల్ అప్ గ్రేడ్ కల్పించాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా మిల్లును మూసివేయడం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
లాకౌట్ ఎత్తివేయాలి డిమాండ్
ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సభ్యులు మిల్లు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి, తక్షణమే లాకౌట్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల జోక్యంతో ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కార్మిక కుటుంబాలు ఆశిస్తున్నాయి.






