- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyanadurgam: వైసీపీ నేతల నిరసన.. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం
by Vemula.Srinu Prasad |
అమరావతిలో పేదల ఇళ్ళ స్థలాలు సమాధులు కట్టుకోవడానికి ఉపయోగపడతాయన్న చంద్రబాబు వాఖ్యలను వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖండించారు...

X
దిశ, కళ్యాణదుర్గం: అమరావతిలో పేదల ఇళ్ళ స్థలాలు సమాధులు కట్టుకోవడానికి ఉపయోగపడతాయన్న చంద్రబాబు వాఖ్యలను వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖండించారు. మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆదేశాల మేరకు కంబదూరు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు పేదల ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలపై గౌరవంతో ఇస్తున్న ఇళ్ళ స్థలాలపై చంద్రబాబు ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు వాఖ్యలు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే పేద ప్రజలకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మహిళలలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Next Story






