పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకొస్తాం : మంత్రి లోకేష్

by Thanuru Gopichand |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నాయకత్వంలో ఏపీ ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది.

పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకొస్తాం : మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నాయకత్వంలో ఏపీ ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి తన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన పాలనతో ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడేలా చేస్తామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో (Kalyanadurgam) పర్యటిస్తున్న మంత్రి లోకేష్ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అనంతపురం (Ananthapuram) జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు.

మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి నామినేటెడ్ (Nominated Posts) పదవులను ఇస్తున్నామని స్పష్టం చేశారు. శవ రాజకీయాలు చేయడం వైసీపీకి (YCP) వెన్నతో పెట్టిన విద్యన్నారు. వైయస్ జగన్ ఏనాడూ సొంత కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. కార్యకర్తే అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగు దేశం మాత్రమేనని కుండ బద్ధలు కొట్టారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను కోరారు.

Next Story