- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనంతలో కదం తొక్కిన ముస్లింలు... భారీ ర్యాలీ

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనంతపురంలో యునైటెడ్ జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ కొనసాగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందన్నారు. ముస్లిం సమాజంపై ప్రజాస్వామ్యవాదులపై అనేక ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలతో ముస్లింల వద్ద ఉన్న లక్షల ఎకరాలను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో త్రిపుల్ తలాక్, హిజాబ్, తినే ఆహారం నుంచి ధరించే బట్టల వరకు కూడా మత సాంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. భవిష్యత్తు కార్యచరణను ప్రకటించి రోజువారీగా తమ నిరసనలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు కూడా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.