అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల హల్ చల్.. పొలంలో రైతుపై దాడి

by srinivas |
అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల హల్ చల్.. పొలంలో రైతుపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఉప్పువంకలో రెండు ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. స్థానిక అటవీ ప్రాంతం నుంచి స్థానిక పొలాలు వైపు వచ్చాయి. అంతేకాదు పొలంలో పని చేస్తున్న రైతుపై దాడి చేశాయి. ఈ దాడిలో రైతుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలుగు బంట్లు తరచూ తమ గ్రామాల్లోకి వస్తున్నాయని, దాడుల చేస్తున్నాయని చాలా సార్లు అటవీ శాఖ అధికారులను ఫిర్యాదు చేశామని, కానీ పట్టించుకోలేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ఎలుగుబంట్ల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story