న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

by Ramesh Naini |

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని హార్మోనీ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా, ఆ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి.

న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని హార్మోనీ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా, ఆ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి. నిన్న రాత్రి వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న వేదికను అలంకరిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందిన మేరకు, వేదిక పనులు కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కరెంట్ షాక్‌తో బాధితుడు కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటికీ, ఏమీ జరగనట్టుగా ఈవెంట్‌ను కొనసాగించారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతోనే ఈవెంట్ ప్రాంగణానికి చేరుకొని నిర్వాహకుల తీరుకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. అయినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story