Boy Surprise: 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయి... 26 ఏళ్ల వయసులో ప్రత్యక్షం

by Disha Web Desk 16 |
Boy Surprise: 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయి... 26 ఏళ్ల వయసులో ప్రత్యక్షం
X

దిశ, వెబ్ డెస్క్: 13 ఏళ్ల కితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 26 ఏళ్ల వయసులో కనిపించాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తమ కుటుంబ సభ్యుడిని చూసి సంబర పడిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. ఇదే జిల్లా ధర్మవరానికి చెందిన శివ తల్లి రత్నమ్మ 13 ఏళ్ల క్రితం చనిపోయారు. దీంతో ఆవేదన చెందిన శివ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పుడు శివ వయసు 13 ఏళ్లు. అయితే అప్పటి నుంచి కూడా శివ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా వారి వెతుకులాటకు ఫలితం లభించింది.

అయితే శివ ఉరవకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్నారు ఓ ఇరానీ టీ కేఫ్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ధర్మవరానికి చెందిన కొందరు టీ కేఫ్ లో టీ తాగేందుకు వెళ్లి శివను గుర్తు పట్టారు. వెంటనే శివ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వెంటనే ధర్మవరానికి వచ్చి శివను కలిశారు. తండ్రి నాగశెట్టి, అన్మదమ్ములు, అక్కా చెల్లెళ్లు శివను అప్యాయంగా పలికించారు. చాలా ఏళ్ల తర్వాత కలవడంతో ఆనందంతో ఉబ్బితబ్బి పోయారు. వెంటనే స్వగ్రామం ధర్మవరానికి రావాలని శివకు చెప్పారు. అయితే ఇంకా కొన్ని రోజులు టీ కేఫ్‌లోనే పని చేసి ఇంటికి వస్తానని చెప్పడంతో శివ కుటుంబ సభ్యులు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు.


Next Story