- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య... ఉద్రిక్తత
అనంతపురం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీ హాస్టల్‌లో ఉరి వేసుకొని వేలాడుతూ విద్యార్థి కనిపించారు...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీ హాస్టల్‌లో ఉరి వేసుకొని వేలాడుతూ విద్యార్థి కనిపించారు. తోటి విద్యార్థులు గది తలుపులు పగలగొట్టి హరిప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి లేఖలు దొరకలేదని తెలుస్తోంది. అయితే మృతుడి మొబైల్ ఫోన్ పూర్తిగా పగిలిపోయి ఉంది.
మరోవైపు విద్యార్థి హరిప్రసాద్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు తల్లిదండ్రులు సైతం తమ కుమారుడు మృతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థి హరిప్రసాద్ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.






