Nara Lokesh: మ‌రో 90 రోజులు సమయం ఇవ్వండి.. సీఎం జగన్‌కు లేఖ

by Disha Web Desk 16 |
Nara Lokesh: మ‌రో 90 రోజులు సమయం ఇవ్వండి.. సీఎం జగన్‌కు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్ ప‌రీక్షకి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మ‌రో 90 రోజులు అద‌న‌పు స‌మ‌యం కేటాయించాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. ప్రతిప‌క్షనేత‌గా ఉన్నప్పుడు అధికారంలోకి వ‌స్తే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుదల చేస్తామ‌ని హామీ ఇచ్చిన జగన్ తీరా సీఎం అయ్యాక ఆ మాటే మ‌రిచిపోయార‌ని లేఖ‌లో గుర్తు చేశారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ కాక‌, మ‌రోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు లేక యువ‌త నిరాశానిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నార‌ని లోకేశ్ ఆవేద‌న వ్యక్తం చేశారు.

తక్కువ సమయంతో ఆందోళన

నాలుగేళ్ల త‌రువాత విడుద‌ల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థుల‌కు ప్రిపేర్ అయ్యే స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వారిని ఆందోళ‌న‌కి గురి చేస్తోంద‌ని చెప్పారు. ప్రిపరేషన్ కోసం 90 రోజుల కంటే తక్కువ సమయం ఇవ్వడం, మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావడానికి ఏడు పేపర్లు పూర్తి చేయాల్సి ఉన్నందున టెన్షన్ ప‌డుతున్నార‌ని సీఎంకి లేఖ‌లో వివ‌రించారు. మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కి ఇచ్చిన గ‌డువుకి అద‌నంగా మ‌రో 90 రోజుల స‌మ‌యం కేటాయించాల‌ని సీఎం వైఎస్ జగన్‌ను లోకేశ్ లేఖ‌లో కోరారు.



Next Story

Most Viewed