- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుతో కాళ్లు పట్టించుకున్న ఘటన.. స్పందించిన గీతం కాలేజీ యజమాని మనీషా
శ్రీ గీతం జూనియర్ కాలేజీ యజమాని మనీషా నాయర్ ఒక జర్నలిస్టు ఇంటికి వెళ్లి, అతని చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీ గీతం జూనియర్ కాలేజీ యజమాని మనీషా నాయర్ ఒక జర్నలిస్టు ఇంటికి వెళ్లి, అతని చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కాలేజీలో జరుగుతున్న విషయాలపై జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ వరుస కథనాలు రాయడంతోనే, ఆమె గుండాలతో వెళ్లి దాడి చేయించారని వార్తలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా మనీషా నాయర్ స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు.
ఇటీవల అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు వ్యవహారంలో తనకు కూడా సంబంధం ఉన్నట్లు సదరు జర్నలిస్ట్ ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాశారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రంగమ్మకు తనకు సంబంధం లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదన్నారు. మహిళా సంఘాలు అంటూ ఉమెన్స్ డే సమయంలో తన దగ్గరకు వచ్చి ఫోటో దిగి ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసుకున్నారని తెలిపారు. ఆ ఫోటో ఈ మీడియా వాళ్లు తీసుకున్నారు.. ఆవిడతో సంబంధం ఉన్నట్లు.. నేను అమ్మాయిలను ట్రాప్ చేశానని నిరాధారమైన తప్పుడు వార్తలు ఎలా రాస్తారని తాను నిలదీయడంతోనే, ఆయన తన తప్పును అంగీకరించి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరారని మనీషా నాయర్ స్పష్టం చేశారు.






