బతుకులు చితికిపోతున్నా పట్టించుకోరా: ప్రభుత్వంపై శైలజానాథ్ ఫైర్

by Vemula.Srinu Prasad |

రైతుల బతుకులు చితికిపోతున్నా సీఎం చంద్రబాబు కనీసం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత డా. సాకే శైలజానాథ్ మండిపడ్డారు....

బతుకులు చితికిపోతున్నా పట్టించుకోరా: ప్రభుత్వంపై శైలజానాథ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రైతుల బతుకులు చితికిపోతున్నా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కనీసం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత డా. సాకే శైలజానాథ్(Sailajanath) మండిపడ్డారు. గార్లదిన్నె మండలం మర్తాడు(Marthadu)లో చీని తోటల(Chinese gardens)ను పరిశీలించి ఆయన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఎండ తీవ్రత పెరగడంతో, బోర్లలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నీటిని విడుదల చేసి అప్పుల్లో ఉన్న రైతన్నలను ఆదుకోవాలని సూచించారు. చీని చెట్లు ఎండిపోయి తీవ్ర ఆవేదనలో ఉన్న రైతన్నలను పరామర్శించడానికి కూడా ప్రజాప్రతినిధులకు సమయం లేదా అని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. వెంటనే ధరల స్థిరీకరణ నిధులను విడుదల చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. అన్నదాతల ఆవేదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరమని శైలజానాథ్ ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వరి, మొక్కజొన్న, చీని పంటలలో నష్టపోయిన రైతన్నలకు వెంటనే న్యాయం చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించి, ధరల స్థిరీకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతన్నలకు జరిగిన అన్యాయాలపై స్పందించకపోతే, వైయస్ఆర్ సీపీ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్నల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.

Next Story