దొంగల బీభత్సం.. తుపాకులతో బెదిరించి 25 తులాల బంగారం దోపిడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-27 04:37:50  IST  )

శ్రీసత్యసాయి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు...

దొంగల బీభత్సం.. తుపాకులతో బెదిరించి 25 తులాల బంగారం దోపిడీ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లాలో దోపిడీ దొంగలు(Robbers) బీభత్సం సృష్టించారు. హిందూపురం మండలం కిరకెరలో రాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకులతో బెదిరించి దంపతులను బంధించారు. అనంతరం 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన దుండగులుగా అనుమానిస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కిరకెరలో కొందరు దుండగులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని తెలిపారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తాము భయపడుతున్నట్లు తెలిపారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను పెంచాలని, దొంగల బెడదను నివారించాలని కోరుతున్నారు.

Next Story