పుట్టపర్తిలో మృతి చెందిన ఒంటరి మహిళ భవనం కబ్జా.. ఐదుగురు టీడీపీ నేతల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒంటరి మహిళకు చెందిన అనంతపురం జిల్లా పుట్టపర్తి శారదా నగర్‌లో ఉన్న భవనాన్ని ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు...

పుట్టపర్తిలో మృతి చెందిన ఒంటరి మహిళ భవనం కబ్జా.. ఐదుగురు టీడీపీ నేతల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapuram) జిల్లా పుట్టపర్తి(Puttaparthy)లో రూ.కోటి విలువైన భవనాన్ని కబ్జా చేసిన ఐదుగురు టీడీపీ(Tdp) నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒంటరి మహిళ ఆస్తిని ఫోర్జరీ పత్రాలతో స్థానిక శారదా నగర్‌లోని ఓ భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే కొందరు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోర్జరీ చేసినట్లు తెలడంతో రిమాండ్‌కు తరలించారు. ఐదుగురు నిందితులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోలీసులు మీడియాతో మాట్లాడుతూ పుట్టపర్తిలో ఎలాంటి కబ్జాలకు తావులేదని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించారు. పుట్టపర్తిలో ఇంకా ఎక్కడైనా భూములు, స్థలాలు, ఇళ్లు, భవనాలు కబ్జాలకు గురైనట్లైతే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసులు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story