- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: అమానుషం.. నడిరోడ్డుపై 3 నెలల చిన్నారి

X
దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిపొత్తిళ్లలో సేదతీరాల్సిన చిన్నారి రోడ్డుపై ప్రత్యక్షమైంది. కళ్లు తెరిచి లోకం చూస్తున్నా తాను ఎక్కడ ఉన్నానో కూడా తెలియని ఆ బుజ్జాయి నడిరోడ్డుపై తల్లడిల్లిపోయింది. ఎవరూ లేని చోట చిన్నారని కన్న తల్లి వదిలి వెళ్లిపోయారు. రోడ్డుపై ఆ చిన్నారి గుక్కపట్టి ఏడ్దింది. ఈ ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా మన్నీలలో ఘటన
ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా మన్నీల క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. చిన్నారిని ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఐసీడీఎస్ విభాగానికి చిన్నారిని అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ ఫకీరప్ప డయల్-100 సిబ్బంది, ఇటుకలపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌ను అభినందించారు.
Next Story