Ap News: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

by Disha Web Desk 16 |
Ap News: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
X

దిశ ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మునుపెన్నడు లేని విధంగా ఆసక్తికర పోటీ నెలకొంది. గతంలో కంటే పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది.

ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు ముమ్మరంగా ప్రచారం చేశారు. దీంతోపాటు ప్రభుత్వానికి, తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోన్న ఉపాధ్యాయ సంఘాల్లో భారీగా చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లకు భారీగానే తాయిలాల పంపిణీ చేయడానికి ఒక పథకం ప్రకారం సిద్ధమైనట్లు సమాచారం. సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు అటే పీడీఎఫ్ అభ్యర్థులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే ఆ అభ్యర్థులకు గతంలో మద్దతు ఇచ్చిన కొన్ని సంఘాలు అధికారపక్షం, ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు.

దాంతో పోటీ హోరాహోరీగా జరుగుతోంది. కొందరు ఓటుకు మూడు నుంచి 5000 రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అధికార పార్టీ మాత్రం ఏకంగా పది వేలు సైతం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీరు కేవలం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పీడీఎఫ్ అభ్యర్థులకు ఈ దఫా గట్టి పోటీ ఎదురవుతోంది.


Next Story

Most Viewed