వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి సవిత జోస్యం

by Vemula.Srinu Prasad |

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయమని మంత్రి సవిత జోస్యం చెప్పారు..

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి సవిత జోస్యం
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే ఎన్నికల్లో వైసీపీ(Ycp)కి ఇప్పుడున్న 11 సీట్లు కూడా గల్లంతై, గుండా సున్నా మిగలడం తథ్యమని మంత్రి సవిత(Minister Savitha) జోస్యం చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) సోమందేపల్లి జెడ్పీ హైస్కూల్లో(Somandepalli ZP High School) జరిగిన మెగా పీటీఎంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ పరకామణి చోరీ(Parakamani theft)ఘటనపై జగన్ వ్యాఖ్యలను మంత్రి సవిత తప్పుబట్టారు. పరకామణి చోరీ చిన్న దొంగతనం అనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. భక్తుల మనోభాలను దెబ్బతీసేలా చోరీలు జరగడంపై క్షమించరాని నేరమన్నారు. పరకామణి చోరీ జగన్‌కు చిన్న దొంగతనం కావొచ్చని, కాని కోర్టులకు ఇది పెద్ద నేరమేనని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో జగన్ మైండ్ బ్లాంక్ అయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలతో ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేశారని మంత్రి సవిత విమర్శించారు.

Next Story