Minister Jayaram: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-05 13:26:22  IST  )

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు...

Minister Jayaram: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు
X

దిశ, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. కదిరి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారని, అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడా లేదన్నారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు ఆదరణ లేదని, జనం తక్కువగా వస్తున్నారన్నారు. లోకేష్‌కు పాదయాత్ర సాధ్యం కాదని జయరాం వ్యాఖానించారు.

READ MORE

Viveka Murder Case: త్వరలో తేలిపోనున్న నిజాలు

Next Story