- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | నీటిపారుదల శాఖ మంత్రికి వైద్యశాఖ మంత్రి వినతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఓ ఆదర్శప్రాయమైన ఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఓ ఆదర్శప్రాయమైన ఘటన జరిగింది. ఓ శాఖ మంత్రి మరో శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలవడమే కాకుండా తమ ప్రాంత ప్రజల సమస్యను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చారు. అది తన శాఖ పరిధి కానందున ఆయన ఆ శాఖ పరిధిలోకి వచ్చే మంత్రి వద్దకు స్వయంగా వెళ్లారు. వారి మంత్రిత్వ శాఖ పరిధిలోని సమస్యను పరిష్కరించి.. ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనతో ఇరువురు మంత్రులు ఆదర్శంగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే జిల్లేడుబండ రిజర్వాయర్ (Jilledu Banda Reservior) ఎత్తును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని వల్ల ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని పొడరాళ్లపల్లిలో ముంపు సమస్య తలెత్తనుంది. దాని వల్ల గ్రామస్తులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) ను గ్రామస్తులు కలిశారు. నీటిపారుదలకు సంబంధించిన అంశం కావడంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వారిని వెంట బెట్టుకొని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లేడుబండ రిజర్వాయర్ ఎత్తు పెంపు కారణంగా పొడరాళ్లపల్లి గ్రామం ముంపునకు గురవుతుందని.. గ్రామస్తులు భూములు, నివాసాలు కోల్పోతారని మంత్రి నిమ్మల రామానాయుడుకు (Nimmala Rama Naidu) వివరించారు. వారికి మెరుగైన పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. పొడరాళ్లపల్లి (Podarallapalli) గ్రామస్తులు జీవనాధారం కోల్పోతున్నందున ఈ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి రామానాయుడు సానుకూలంగా స్పందిస్తూ రైతులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మంత్రులు వ్యవహరించిన తీరు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






