- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నాయకులపై ఎటాక్..!
నంతపురం జిల్లా ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ధర్మవరం(Dharmavaram)లో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నాయకులు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు టీడీపీ నాయకులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మవరంలో పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో భారీగా మోహరించారు.
వైసీపీ నాయకుడు జమీర్(YCP leader Jamir) ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీజేపీ(Bjp)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ధర్మవరం పల్లవి సర్కిల్(Dharmavaram Pallavi Circle)లో ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అదే మార్గంలో రెండు కార్లు, 4 బైకులుతో టీడీపీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే జమీర్ అనుచరులు, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో టీడీపీ నాయకులపై జమీర్ అనుచరులు దాడి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా రెచ్చిపోయారు. వాళ్ల ఎదుటే టీడీపీ నాయకులపై దాడి చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో గాయపడిన టీడీపీ నాయకులను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జమీర్ ఇంటిపై టీడీపీ నేతలే దాడి చేసేందుకు యత్నించారని ఆయన అనుచరులు అంటున్నారు. బీజేపీలో తమను చేరవద్దని టీడీపీ నాయకులు బెదిరించారని చెబుతున్నారు.






