Breaking: రెప్ప పాటులో ఘోరం.. నలుగురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-17 16:27:00  IST  )

బత్తలపల్లి మండలంలో ఘోర ప్రమాదంచోటు చేసుకుంది..

Breaking: రెప్ప పాటులో ఘోరం.. నలుగురు దుర్మరణం
X

దిశ, ధర్మవరం: బత్తలపల్లి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం వైపు నుంచి బొలెరో వాహనం బత్తలపల్లి వైపు వెళ్తోంది. బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు ప్రయాణికులతో ఆటో వెళ్తోంది. కరెక్ట్‌గా నాగుల కట్ట వద్దకు వెళ్ళగానే రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారితో కూడా ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story