గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం.. అమ్మవారి ఆభరణాలు చోరీ

by Vemula.Srinu Prasad |

గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం ప్రదర్శించారు..

గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం.. అమ్మవారి ఆభరణాలు చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: చేతివాటానికి స్థలపురాణంతో పనిలేదని ఇప్పటికే పలుమార్లు రుజువు అయింది. కొందరు వ్యక్తులు జనాల సొమ్మే కాదు.. దేవుడి సొత్తును సైతం వదిలిపెట్టడం లేదు. ఆలయంలో పని చేస్తూ ఆ దేవుడికే శఠగోపం పెడుతున్నారు. ఇలాంటి ఘటన కోకొల్లులుగా ఉన్నా తాజా ఘటనలో ఆలయ ఈవో చేతివాటాన్ని జనాలు తిప్పి కొట్టారు. తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎర్రదొడ్డిలో జరిగింది. స్థానిక గంగమ్మ ఆలయంలో అమ్మవారికి వెండి ఆభరణాలు అలంకరించి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నంటారు అక్కడి జనం. అయితే ఈ ఆభరణలాలపై ఈవో మురళీకృష్ణ కన్ను పడింది. ఆదివారం కావడంతో ఈ రోజు చేతివాటాన్ని ప్రదర్శించారు. అమ్మవారి సొమ్ములను దోచేశారు. ఆటోలో వెళ్లి అమ్మవారి 5 కేజీల వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. దీంతో స్థానికులు గుర్తించి ఆటోను అడ్డుకున్నారు. ఈవోను పట్టుకుని వెండి ఆభవరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఆలయ ఈవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఏం జరుగుతుందో చూడాలి.

Next Story