- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: 26 మంది విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరం
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లాలో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు..

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుక్కరాయసముద్రం ఎస్‌ఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మంగళవారం రాత్రి విద్యార్థులు గుడ్డుతోపాటు టమాటా రైస్, పెరుగన్నం తిన్నారు. తెల్లవారేసరికి వారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పి తట్టుకోలేక విద్యార్థులు అల్లాడిపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఏడుగురి విద్యార్థుల పరిస్థితి విషయంగా ఉంది. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులను అబ్జర్వేషన్ చేస్తున్నారు.
ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






