ఉపాధి హామీ కూలీ నుంచి సమన్వయకర్తగా లక్కప్ప.. అంతా ఆయన పుణ్యమే..!

by srinivas |   ( Updated:2024-02-17 14:49:23.0  )
ఉపాధి హామీ  కూలీ నుంచి సమన్వయకర్తగా లక్కప్ప.. అంతా ఆయన పుణ్యమే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఉపాధి హామీ కూలీగా ఉంటూ పార్టీ కోసం కృషి చేసిన ఈర్ల లక్కప్పను వైసీపీ అధిష్టానం మడకశిర సమన్వయకర్తగా నియమించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో లక్కప్పకే సీటు ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో లక్కప్ప ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి కృషి వల్ల తాను మడకశిర సమన్వయకర్తగా నియమింపబడ్డానని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సామన్యుడి కూడా ఎమ్మెల్యేను చేయగలిగే సత్తా ఒక్క వైఎస్ జగన్ కే ఉందని చెప్పారు. ఉపాధి హామీ కూలీగా ఉంటూ మడకశిరలోని సమస్యలపై తాను కృషి చేశానన్నారు. అలాంటి తనను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం జగన్‌కు రుణ పడి ఉంటామని చెప్పారు. మడకశిర ప్రజలు ఆశీర్వదిస్తే తాను ఎమ్మెల్యేనవుతానని ఈర్ల లక్కప్ప పేర్కొన్నారు.

Next Story

Most Viewed