Dharmavaram | పరిటాల శ్రీరామ్ ను కలిసిన దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్

by Thanuru Gopichand |

ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకుడు షరీఫ్ రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ (Dudekula Corporation) డైరెక్టరుగా నియమితులయ్యారు.

Dharmavaram | పరిటాల శ్రీరామ్ ను కలిసిన దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకుడు షరీఫ్ రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ (Dudekula Corporation) డైరెక్టరుగా నియమితులయ్యారు. తన ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ యువ నాయుడు పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షరీఫ్ (Sharif) ను పరిటాల శ్రీరామ్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దూదేకుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. అనంతరం మైనారిటీ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇమాంలు, మౌజాన్ల వేతనాల కోసం ముఖ్యమంత్రి రూ.90కోట్లను విడుదల చేశారని శ్రీరామ్ తెలిపారు. హామీనిచ్చిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలోనే రూ.1.4కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదే నిదర్శనం అని శ్రీరామ్ తెలిపారు.

Next Story