Cyber Fraud: రైల్వే ఉద్యోగికి సైబర్ టోకరా.. రూ.72 లక్షలు స్వాహా

by Rani Yarlagadda |
Cyber Fraud: రైల్వే ఉద్యోగికి సైబర్ టోకరా.. రూ.72 లక్షలు స్వాహా
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ మోసాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కేటుగాళ్లు ఉద్యోగులను బోల్తా కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు దోచుకుని నిండా ముంచేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలో సైబర్ మోసం వెలుగుచూసింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని (Mumbai Crime Branch Police) ఫోన్ చేసిన కేటుగాళ్లు.. బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరుందంటూ రైల్వే ఉద్యోగిని (Railway Employee) బెదిరించారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తమకు డబ్బు పంపాలని డిమాండ్ చేసి.. రూ.72 లక్షలు కాజేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఉద్యోగి.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది.

మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఓ ఉద్యోగిని మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని నమ్మించి.. ఇల్లెందు మండలానికి చెందిన ఉద్యోగిని మోసం చేశారు. అధిక లాభాలు చూపించి రూ.16.6 లక్షలు స్వాహా చేశారు. దాంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed