- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | ఆలయ ఈఓపై చర్యలకు సీఎం ఆదేశం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ దేవాలయంలో (Yarradoddi Gangamma Temple) చోరీ యత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ దేవాలయంలో (Yarradoddi Gangamma Temple) చోరీ యత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. స్వయంగా దేవాలయ ఈఓనే చోరీ యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో వివాదం మరింత ముదిరింది. ఇది కాస్త సీఎంఓకు చేరడంతో స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandra Babu Naidu) కూడా స్పందించారు. సంబంధిత ఈఓపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి సొత్తును తస్కరించాలని చూసిన ఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు హుటాహుటిన చర్యలకు దిగారు. యర్రదొడ్డి గంగమ్మ దేవాలయ ఈఓ మురళీకృష్ణపై కఠిన చర్యలను తీసుకున్నారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేశారు. అయితే గంగమ్మ గుడిలో 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను ఈఓ చోరీ చేస్తూ పట్టుబడినట్లు ఆరోపణలున్నాయి. ఆటోలో సతీసమేతంగా వాటిని మురళీకృష్ణ తీసుకెళ్తుండగా పలువురు భక్తులు అడ్డగించారు. అతడిని అమ్మవారి సొత్తుతో సహా పట్టుకొని పోలీసు స్టేషనుకు తరలించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. భగవద్ భక్తులందరూ ఆగ్రహానికి గురయ్యారు. అయితే చోరీ యత్నంపై కేసు కూడా నమోదైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో చోరీ యత్నం నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్వయంగా సీఎం స్పందించడంతో అధికారులు తదుపరి చర్యలను కూడా ముమ్మరం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.






