Anantapuram | పర్వతాన్ని అధిరోహించిన తెలుగు బిడ్డ

by Thanuru Gopichand |

టాంజానియాలోని కిలిమంజారో (Mount Kilimanjaro) పర్వతాన్ని తెలుగు బిడ్డ అధిరోహించింది. కేవలం 19ఏళ్ల వయసులోనే శిఖరాన్ని చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Anantapuram | పర్వతాన్ని అధిరోహించిన తెలుగు బిడ్డ
X

దిశ, వెబ్ డెస్క్ : టాంజానియాలోని కిలిమంజారో (Mount Kilimanjaro) పర్వతాన్ని తెలుగు బిడ్డ అధిరోహించింది. కేవలం 19ఏళ్ల వయసులోనే శిఖరాన్ని చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగువారంతా తలెత్తుకునేలా పర్వత శిఖరంపై జెండాను ఎగురవేసింది. ఆ యువతి మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని (Anantapuram) శింగనమల నియోజకవర్గం దుగ్గుమర్రికి చెందిన కుసుమ (Kusuma). పెద్దన్న, నారాయణమ్మ దంపతుల కూతురు. ప్రస్తుతం కుసుమ డిగ్రీ చదువుతున్నారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కుసుమకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూట్యూబ్ లో చాలా మంది పర్వతారోహకులు కిలిమంజారో పర్వతం ఎక్కడం చూశానన్నారు. సాహసోపేతంగా (Adventurous) ఉన్న ఆ పనిని తాను కూడా చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే పేదరికం వల్ల తనతో కాదని భావించామన్నారు. అనుకోకుండా కిలిమంజారో ఎక్కే అవకాశం వచ్చిందన్నారు. నవంబరు 8న అక్కడకు బయలుదేరి వెళ్లామన్నారు. పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయన్నారు. వాతావరణం చల్లగా ఉండడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు కలిగాయన్నారు. వాటన్నింటినీ దాటుకొని కిలిమంజారో పర్వతం అధిరోహించడం ఎంతో అద్భుతంగా తోచిందన్నారు. తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సహకారంతో పాటు ప్రోత్సాహం తాను ఈ ఘనత సాధించేలా చేశాయని తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నానని కుసుమ తెలిపారు.

Next Story